15 June 2017

దుర్జన పద్ధతి

ఏనుగు లక్షమణ కవి వలె ఎలకూ చి బాలసరస్వతి కూడ భర్తృహరి నీతి పద్యములను తెనిగించెనుతిరులో ఒకటి.

వసుధం గుందేటి కొమ్ము తెచ్చుకొనగా వచ్చం బ్రయత్న 0 బున న్ /
వెస ద్రావన్ జలమెండమావుల నెయేని 0గాంచవచ్చున్ నిజం /
బిసుకన్నూ నియబిండవచ్చ బ్రతిభా హీ నాత్ము డౌమూర్ఖ దె /
ల ఎసముర్ద త్వము లేదలన్ సురభి మల్లా నీతివాచస్ప తీ'
దీని అర్ధంతి విరి ఇసుమున తైలంబు పద్య అర్థమే.





40. చదువే రూపము. గుర్తమౌ ధనము పూజ్య శ్రేణి పూజ్యంబు, న/
మ్మదమున్ కీర్తి యు భోగమిచ్చు నృపసన్ మానంబు గల్ పి oచు నె/
ల్ల దెసన్దోడ్పడు, దైవతుల్యము సిరుల్దామిట్టివే.. యా పను/
ల్చదువుల్ నేరని వారె సుర బి.మల్లా నీతివాచస్ప తీ'

తా - చదువే రూపము దాచుకొన్న డబ్బు పూజనీయము ముదము, కీర్తిని భోగనును సన్ మానము కలిపించును ఎక్కడైన తోడుండును. దైవముతో సమానము చదువు నేర్పని వారికి ఇవి సాధ్యపడవు.





41. కారణములేని కలహంబు గరుణ లేమి/
పరవధూప ర ధనవాంఛ బందు సాధు /
జనములందసహిష్ణుత్వ మనగ జగతి /
బకృతి సిద్ధంబు లిమ దుష్ట నికరమునకు.
తా - దయాహీనత, నిష్కారణమైన కలహము పరులధనము నందు పరస్త్రీల యందు ఆ శక్తి సర్జనులయందు బందువుల యందు ఓర్ప్రవలేమి దుర్జనుల స్వభావ సిద్ది గణములు


 కాలో హిబలవాన్ కర్తా హసతతం సుఖదు : ఖయో :/
నరాణాం పరతంత్రాణామ్ పుణ్యపాపాను యోగత:
కాలం కలసి రాని సమయంలో మనిషి నేర్చుకోవలసినది సహనమే దానికి జవాబు ఓర్ పు. తో ఉండడమే మనిషి సుఖదు:ఖాలకు కాలమే కారణం.

అర్థ పద్ధతి.

31. జాతి దొలంగుగా తగుణశక్తి రసాతల సీమకు 0 జనుo/
గా తకులoబు బూది యగుగా త. నగంబున నుండి శీలముం /
బాత ముజెందుగా తబ హుభo గుల విత్త మెమాకు మేలు వి/
ఖయాతగుణంబు లెల్ల దృణ కల్పము లొక్క ధనంబు లేవడిన్.

తా - జాతిపాతాళమునకు పోయినను. సత్ గుణములు అంతకంటె క్రింద పడిన, శీలము కొండపై నుంచి కింద పడి నా.వంశ ముపోయినా, శౌర్యమునందు పిడుగు పడి నామాకేమీలో పము లేదుద్రవ్యము ఉన్న చాలును. ఈ ద్రవ్యము లేక పోవునే ని పైన చెపిఎ నవి ఉండి యుగడ్డిపోచకైన కోరగావు.





32. ఏ నరునకు విత్తము గల / దానరుడు కులీను దధి కు/ డార్ యు డ తండే దీనిధి/
థన్‌ యుడు నేర్పరి /
నానా గుణగణము కాంచనంబున నిలుచున్.

తా- లోకమునందు ధనము కలవాడే కులీనుడని, పండితుడని, శాస్త్రము తెలిసిన వాడని , గుణావ గుణములు ఎరిగినవాడని చక్కని వా క్ ధోరణి కలవాడని , చూడదగిన వాడని , రూప వంతుడని, చెప్పబడును. ధనము ఒకటి ఉంటే పై గుణములు లేకపోయినా వానియందు ఈ గుణములు ఉన్నవి అని తలుచు దురు.




33. యతి సంగంబున. బాలుడా దరము చే, జ్య ఆ భర్త దుర్మం త్రి చే/ శ్రుతి హానిన్. ద్విజు, డన్వయంబు ఖలు చే, క్రూరా అష్తి చేశీ ల , ము/
ద్దతిచే మిత్రత, చూపులేమి గృషి, మద్య ప్రాప్తి చే సిగ్గు, దు/
ర్మతి చేసం పదలున్.నశి oచు, చెడునర్ధంబుల్ ప్రమాదం బునన్.

తా - దుర్మం త్రము వలన రాజు, సంగము వలన యతి . లాలించుటచే పుత్రుడు, వేదాధ్యయన లేమి చేబ్రాహ్మణుడు, కుపుత్రుని వలన వంశము. దుర్మార్గుల సేవ వలన సదాచారము, మద్యపానము వలన లజ్జ తరచుగ చూడకపోవుట వలన వ్యవసాయ ము, దేశా 0 తర సంచారము చేత స్నే హము, అనురాగలే మి చేత మైత్రి, నీతి లేమి చేత సంపద, అపాత్రదానము చేతను, పరాకు చేతను ధనము నశించును.




34. దానము భోగము నాశము
పూనిక తో మూడు గతులు భువి ధనమునకున్ /
దానము భోగము నెరుగని /
దీనుని ధనమునకు గతి దృతీయ మెపొసగున్.

తా - ధనవ్యయమునకు సత్పాత్రదానము, తానను భవించుట, దొంగలు. మొదలగువారు హరించుట అని మూడు దారులు. కనబడుచున్నవి.ఎవడు సత్పాత్ర మునకు ఇయ్యక. తానను భవింపక ఉండునో వాని ధనము మూడవ దారి యే అగును అనగా దొంగల పాలగును.





35. శాణ విగ్నష్ట రత్నమును శస్త్ర హతుం డగు శూరుడున్ మద/
క్షఈ ణగజంబు సైకత విశిష్ట శరన్నది యున్.నవక్షపా/
ప్రాణవిభుండు చండ సురతాల సబాలిక యున్ ధ నెై కవి /
శ్రావణ శూరులుండగడు గృశత్వమునం బ్రభ గాంతురిద్దరిన్.

తా - సానపెట్టిన మణియు, ఆయుధ క్షతములు గలిగి యున్న శూరుడును, మదజల స్రవము చేత చిక్కి నఏనుగును. శరత్ కాలమున ఎండిన ఇసుక తిన్నెలుగల నదియు, కలామాత్రా విశిష్టుడగు చంద్రుడును, రతి క్రీడ చేఅలసిన నవ యవ్వన బాలిక యు.సత్ పాత్రదానము చేత ఐశ్వర్యమును కోలుపోయిన రాజులు ఎంత కృశించి నను విశేషముగ ప్రకాశిం తురు.




36 చేరి యొకండు నెవ్వబడి చిక్కు చు జేరెడు శాలిధాన్యమే /
కోరున తండు పిమ్మట న కుంఠ ధనోన్న తుడై వసుంధరం /
బూరికి సాటిగా దలచు భూరి ధనాడ్ యుల చొప్పు నేకమై /
గౌర నమున్ లఘుత్వమును గెై కొనువస్తువులందు నెల్లడన్.

తా - దరిద్రమును అనుభవించునపుడు గుపెఎడు దాన్యమును ఆశించున తడు కాలం గడిచిన తరువాత సంపద కలిగిన భూమండలమును గడ్డిపరకవలె తలచును. కావున సమయమును బట్టి వస్తువులు అధిక ములని. అల్పములని చెప్పబడును. ఒక సారి స్వల్పమైనది మరియొక సారి అధికముగ . అధికమైనది తక్కు వగతో చును.



37. ధరణీ దే నువు బిదు కంగ దలచి తేని /
జనుల బోషింపు మధిపవత్సముల మాడ్కి /
జనులు పోషింపబడుచుండ జగతి కల్ప /
లత తెరుంగున సకల పలంబు లొసంగు.

తా - రాజా ! భూమి యను ఆవు నుండి ధనము పితుక దలచితివే ని అవుదూడను పోషించిన విధముగ జనులను పోషింపుము. ఆ జనులును చక్కగ నీవు పోషించితివే నిభూమి కంపవల్లి మె కోరిన వానిని అన్నీ ఫలింపజేయును.




38 సత్య మనృతంబు పరుషోక్తి సరసభాష /
ప్రాణిహింస యు. దయయులో భంబు నీ గి/
కనక సంగ్రహ వ్యయములు గలుగు వార/
రమణికైవడి బహు రీతి రాజనీతి.

తా-రాజనీతి సమయానుసారముగ సత్య మిశ్రమము. అసత్య యుతము ఒక చోట నిష్టురమున ఒకసారి చెవులకు ఇంపుగ ఉండును. ఒక చోట బాధ ఒక చోట దయ, ఒక చోట పిసిని తనము, ఒక చోట దానము ఒనర్చును.ఒక చోట వ్యయమ.. ఒక చోట సంపాదన మును చేయుచు వారాంగనమె ఉండును.




39. ఆ జ్ఞా యును గీర్తియును భూ, సురావనంబు /
రానమును భోగ మిత్రసంత్రాణనములు /
షట్ గుణంబులు గలుగ వే జనులయందు /
వారి గోల్చిన ఫలమేమి వసుమతీ స.

తా-దుర్జన శిక్షణము సత్కీర్తి, బ్రాహ్మణ పరిపాలనము, సత్పాత్రదానము స్ర క్చందన విహారాది భోగములు, ఆపన్నుల గుమిత్రాదుల రక్షించుట అను సద్గుణ షట్కము లేని రాజుల సేవించుట వలన లాభమే.మియు లేదు.



40. వనజ భవుండునెన్ నోసట వ్రాసిన సొమ్మ ఘనం బొ కొంచెమో /
వినుమరుభూమి కేగిన లభించు మేరువు జేరబోయినన్ /
ధన మధికంబు రాదు కడు దెైన్యము మాను ధనాఢ్యలందున /
వ్యనిధి నూతదుల్యముగ గ్రహించు ఘటం బు సూడు మా '

తా-తన నుదుట వ్రాసిన ధనము మరుభూమిలో ఉన్నను తప్పక లభించును. ఎడారిన oదైనా అంతకంటే ఎక్కు వ పొందడు. కావున ధనవంతులను చూసి దీనత్వము కనబరచకు. కుండను బావిలో ముంచి నా సముద్రములో ముంచినా.దాని పరిమితమైన జలమును మాత్రమే గైకొనునుకదా . ఈ దృష్ట్రాo తముగ నచటికి బోయినను ప్రాప్తి ఎంతో అంతే లభించును కలిగినంత మట్టుకు సంతోషించవలెను.

Blogging Courtesy, my mother Mrs. N .V. Lakshmi

07 June 2017

మాన శౌర్య పద్ధతి

మాన శౌర్య పద్ధతి.
21. గ్రా సము లేక స్ర్క్ క్కిల జరా కృశమైనవి శర్ణమైన సా /
యాసము నైన నష్ట రుచియైనను బ్రాణభయార్త మైన ని/
స్థాసమ దే భ కుంభపి శిత గ్రహలాల సశీల సాగ్రహా
గ్రేసరభాసమానమగు కేశ రి.జీర్ణతృణంబు . మేయునే.?

తా. శూరా గ్రణి యగు సింగము ఆకలి చేడ స్నను ముదిమి చే చిక్కన ను, కష్ట స్థితి పొందినను, కాంతి విహీనమయినను. ప్రాణములు పోవుచున్నను. మదించి న ఏనుగు యొక్క కుంభస్థలమును పగులగొట్టి అందలి మాంసమును భుజింప దలచునే కాని ఎoడుగడ్డిని తిను నా ఏమి?



22. స్నయువ సావ సే కమ లినమ్మ గునెమ్ము గ్రహించి జాగలం /
బాయత మోదముందు జనదా కలిజెంతనున్న గో/
మాయువు దాని జూచి పరిమార్పక సింగము దంతి గూల్చునే /
చాయల నెల్లవారు నిజ సత్వ సమాన ఫలార్దులే కదా!

తా కుక్క మాంస హీనమైన సన్నని నరములు కొంచెము కండ ఉండిన మలినమైన ఎముక దొరికినంత నే సంతోషము చెందును. అది దాని ఆకలి తీర్పదు.సింగము తన ఎదుట జంబుక ములు తిరుగుచుండినను వానిని వదలమనమంతా తిరిగి గజరాజమును చంపును. కావున జనుల కష్టకాలములోన కూడ తమ శక్తికి తగిన లాభము నే కోరుదురు కాని ఎక్కు వ తక్కు వలు కోరారు.

23. వాలమున్ త్రిప్పు నేలబడి వక్త్రము గుక్షి యుజూపు గిన్ Oదటం /
గాలిడుద్రవ్వన్ పిండ దుని కట్ ఎదుట న్ శునకంబు భద్ర శుo/
డాలము శాలితండుల గుడంబులు చాటు వచస్ శతంబు చే/
నోలి భుజించు దైర్య గుణయుక్తిగ జూచు మహోన్నత స్థితిన్.

తా - కుక్క తనకు పిడికెడు అన్నము పెట్టువాని ఎదుట తోక నాడించుట' కాలితోనే భూమిపైబడి నోరు కడుపు చూపించుట మొదలగు నీచ కృత్యము లెన్నో చేయును. ఉత్తమ గజము దైర్యముతో చూచుచు మావటివాని చేత ప్రియ వాక్యములచేత లాలింపబడుతు ఆహారమును గ్రహించును.




24. ప్రాణి లోకంబు సంసారపతిత మగుట /
వసుధ పై గిట్టి పుట్టని వాడు గల డె/
వాని జన్మ oబు సఫలము వాని వలన /
వంశము ధికోన్నతి వహించి వన్నెకె క్కు.

తా - చావుపుట్టుకలను నవి ఎప్పుడును గల ఈ సంసార చక్రమున చచ్చిన వారందరు పుట్టు వారే.అట్లు పుట్టిన వారిలో నశింపనివారు ఎవరు? ఎవని పుట్టుక వలన వంశము కీర్తి మొదలగు వానితో వాసి గాంచునో వాడే జన్మించినవాడు. వాని జన్మయే గణనీయము.



25. కుసుమ గుచ్చం బునకు బోలెబాస గు శౌర్య /
మానవంతున కి విరెండు మహితగతులు /
సకల జనమస్తక ప్రదేశములనైన /
వనము నందైన జీర్ణ భావంబు గనుట.

తా. - మహనీయుడగు విద్వా o సునకు పుష్పగుచ్చమునకు వలె అందరిచేత శిరసావహింపబడుట యో లేక అరణ్యములోనే మరణించుట యో తప్ప వేరు విద్ధము లేదు.



26. గురు ముఖ్య ల్. గల రేవురార్ ఉరుశుభాo గుల్ ఖేచరుల్ వారిలో /
పర విక్రాంత విహారి రాహువైన పుడున్ వైరంబు సేయండు భా/
స్వరులన్ భాస్కర యామినీ చరులనే బాధించుచున్నాడద /
త్పరతన్‌ . మస్తక శేషమూర్తియగునా దైత్య 0 డుగర్వOబునన్.

తా - బృహస్పతి మొదలగు గణనీయములైన అయిదారు గ్రహములున్నను పరాక్రమ శీలుడగు రాహువు వారి తెరువుపోక శీర్షావశిష్టుడై యుండియు తేజోవంతుల గు సూర్య చంద్రులను మాత్రమే పర్వ కాలములందు పీడించుచున్నాడు.





 27. భువనస్ శేణి వహించు శేషుడు ఫణా భోగంబు పై సంతతం /
బవలీలన్ భరియించు బృష్టమునగూర్మాధీశ్వరుం డా తనిన్ /
ధవళ క్రోడవ శాత్ము జేయు నతనిన్ వారాశియ శ్రా 0 తి చే/
నవురా! ధీర చరిత్ర సంపదల సంఖ్యూత ప్రభావోన్నతుల్.

తా - ఆదిశేషుడు పదునాలుగు లోకములను తన పడగల చేత మోయుచున్నాడు. అతనిని ఆది కూర్మ మూర్తి మూపున వహించు చున్నడు.ప్రళయకాల సముద్రుడట్టి ఆది కూర్మమును, ఆదివరాహునికి లోబడిన వానిని గా చేయు చున్నాడ.కావున మహాత్మల మహిమకు మేరలేదు.




 28. సమధికభీషణ జ్యలన జూల నిర్గమదుస్స బంబు చే/
స మద సురేంద్రముక్తకు లి శిక్షతి చేను చితంబు ప్రాణ షూ/
తముహిమవత్ కుమారునకు దండ్రిని శాతశతార పాత ఖాఏ /
దమున మునుంగుచున్న తరిదా జలరాశి జా రంగనర్హమే.

తా - హిమవంతుని కుమారుడగు మైనా కునికి, దేవేంద్రుడు తన బలిమి కొలది వేయు నిప్పులు గ్రక్కు చునోర్వలేక మీద పడుకులిశ ముయొక్క ధారాహతి చే చచ్చు టే కొంచెము మంచిది కాని.ఆ పాటు చే మూర్చ నాందిన తన తండ్రిని వదలి తన ప్రాణములను రక్షించుకోనుటకు సముద్ర మన దాగి వుండట తగునా?



 29. అర్క కాంతమచేతనంబ యూ సవితృ /
పాదముల సోకినంత నే ప్రజ అవ.రిల్లు /
గాన నభివాన వంతు డెం దైన శత్రు/
కృత తరస్కార మొట్లు సహింప నేర్చు.

తా - సూర్యకాంత మణి అచేతనమైన సూర్య ని పాదములు - ( కిరణములు) తనకు తగిలినంత మాత్రము వ్య మండును. కావున తేజోవంతులు పరులు చేయు ధిక్కారమును సహించి ఊరకుండరు.



 30. విదిలింప నురుకు సింగపు /
గొదమ యు మదమలిన గండకుంజరములపై /
ని ది బలశాలి కి నైజము/
గద తేజో నిధికి వయసు కారణమగు నే.

తా - సింహము బాల్యదశలో ఉన్నా మదధారలు స్రవించుటచే మలినమయిన గోడల వంటి చెక్కిళ్ళ . గల మదగజముమీదికి ఉరుకును. ఇది బలవంతుల స్వభావము. పరాక్రమ ప్రకటనకు వయసుతో పని లేదు.
ఇది నీతిశతకము నందు మానశౌర్య పద్ధతి వర్ణన సమాప్త o.



Blogging Courtesy, my mother Mrs. N .V. Lakshmi

విద్వత్పద్దతివర్ణన

11. సకలకలా విభూషితులు శబ్ద విదుల్ నయ తత్త్వ బోధకుల్
ప్రకట కవీంద్రులే నృపతిపజ్జను నిర్దను లైచరింతురా
వికృత పుజాడ్యమా దొరది విత్తము లేక య వారు పూజ్య లం
దక జన దూషితంబులు షునoబులుగా వె.యమూల్య రత్నముల్.


తా - వ్యాకరణాది శాస్త్రంబులను నిర్దుష్టముగ మనోహరముగ పలుకుచు విద్య. నేర్చుకొనువారికి శాస్త్రంబులు బోధించుచు సుప్రసిద్ధి చెందిన పండితులు ఏప్రభువు వద్ద సైన ధన హీనులుగా నుండి న అది ఆ ప్రభువు యొక్క తెలివిలేమి నే తెలుపును.రత్న పరిజ్ఞానము లేని వర్తకుడు అమూల్యమణులను తక్కు వెలగలవానిగా చెప్పినంత మాత్రము చేతనే ఆ రత్నములకు లోపము రాదు కదా!


12. హర్తకు గాదు గోచర. మహర్ నిశమున్ సుఖ పుష్టి సేయు స
త్కీర్తిఘటింతు విద్యయను దివ్య ధనంబఖలార్థి కోటి కిం
బూర్తిగ నిచ్చినన్ బెరుగుబోదు . యుగాంతపు వేళ నెైన భూ
భర్తలు తద్దినాధికుల పట్టున గర్వము మాను. టొప్పగన్.


తా. - విద్య అను ధనమును దొంగలు దొంగిలించలేరు. అది ధనము వలె గాక ఎల్లప్పుడు సుఖము నే కలుగజేయను. కోరిన వారికి ఇచ్చుచుండిన మరింత వృద్ధి చెందును ప్రళయము వచ్చిన నశింపదు. ఇట్టి విద్య. గల వారి యెడ రాజులు దురాగ్రము చెంద రాదు.వారిని అనగా విద్యను వారిని ఎవరు ఎదుర కొనలేరు.



ప్రభువులు పండితుల గు వారి వలన గర్వ
కలన మానుడు వారు మీ కలిమి తృణము
లీల. బోలింప.లేమి మృణాళ గుణము
భూరి మద.వారణములకు వారణం బె.


తా - యదార్ద.మెరిగిన పండితులను అవమానింపకుము. నీ సంపద చూచి నీ మాటలను భరింతురని తలచెద వే మొకాని వారు నీ సంపదను గడ్డి . పోచవలె చూతురు. నూతన ముగ మదధార కారుల గుటచేత నలుపెక్కి నచెక్కిళ్ళగల మద గజములను తాము రతూ టి చేత. గట్టివేయుట సాధ్యమగునా?



14. వనజ భవుండు కోపమున వాహనమైన మరాళ భర్తకున్/
వనజవనీ విహార కలనంబు దొలంగగజేయుగాని గుం/
భనమున దుగ్ధ జీవన విభాగ విధాన నిరూఢ నెైపుణి/
జనిత మహాయశో విభవ సారము హంసకు మాన్పజాలు నే.


తా - బ్రహ్మకు హంస మీద కోపము వచ్చిన పద్మసరోవరములందు విహరించకుండా చేయగలడు గాని పాలు నీళ్ళను వేరుపరచునేర్పును తీసివేయలేడు కదా!



15. భూషలుగా వు.మర్త్య . లకు భూరిమ యా O గద తారహారముల్ /
భూషిత కేశపాశ మృదుపుష్పసుగంధ జలాభిషేకముల్ /
భూషలుగా వు. పూరుషుని భూషిత జేయు బవిత్ర వాణి వా /
గ్భూషణమే.సుభూషణము భూషణముల్ నశియించు న న్ని యున్.


తా - పురుషునకు భుజకీర్తులు. సూర్య హారములు చంద్రహారములు మొదలగు సొమ్మలు గాని, స్ నానము. చందనము పూసుకొనుట పూలు ముడుచుకొనుట, కురులు దూవుట మొదలగు వానిలో ఏదియు అలంకారమును ఇవ్వజాలదు. శాస్త్ర సంస్కారముగలవాక్కు ఒకటే అలంకారమును కలుగజేయును. సువర్ణమయాది భూషణములన్నీ. నశించును. వాక్ భూషణము ఒక్కటే నశింపని భూషణము





16. విద్యని గూఢ గుప్త. మగు విత్తము రూపము పురుషాళికిన్ /
విద్య యశసు. భోగకరి విద్య గురుండు విదేశబంధుడున్ /
విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లేదిలన్ /
విద్య నృపాల పూజితము విద్య నెరుంగని వాడు మర్తు డే.


తా - సజ్జనునికి విద్యయే ధనము విద్యయే రూపము. రహస్యముగ దాచిన ధనము. సకల భోగములను కీర్తిని.సుఖమును కలుగజేయును. విద్యయే గురువు వల అన్నీ బోధించును. పరదేశమునందు చుట్టము వలె సహాయపడును. విద్య రాజపూజితము.ధనము ఇటువంటిది కాదు.ఇట్టి విద్య లేనివాడు పశువు తో సమానుడు.





17. క్షమకవచం బుక్రోధ మది శత్రువు జ్ఞాతి హుతాశనుండు మి/
త్రము దగుమందు దుర్జనులు దారుణ పన్నగముల్ సువిద్య వి/
త్తము చింతల జజ భూషణముదాత్త కవిత్వము రాజ్యమీక్ష మా /
ప్రముఖ పదార్థముల్ గలుగు పట్టున దత్ కవచాదు లేటికిన్.


తా - ఓర్పు ఉన్న యెడల కవచము అఖఖరలేదు. కోపము ఉంటే శత్రువులు 'దాయాదులు ఉంటే వేరే నిప్పు' మిత్రుడు ఉంటే ఔషదము ,దుర్జనులు ఉంటే సర్పము అవసరము లేదు




18. వర కృప భృత్య . లందు నిజ సర్గము నందనుకూల వృత్తి కా/
. పురుషుల యందు శాట్యము సుబుద్దుల యందును రక్తి దాల్ మిస/
ద్గురువుల యందు శౌర్యము మృగాక్షులయందు బ్రగల్భ భావమీ /
వరుసగళా ప్రవీణుల గు వారల యందు వసించు లోకముల్.


తా. బంధువుల యందు దయతో అనగా వారి ఇష్ట్రానుసారము నడుచుట, సేవకులయందు దయ, దుర్జనులయందు కఠ.నముగా నుండుట, మంచి వారియందు ప్రేమ రాజలయందు అనుసరణ మును, విద్య తెలిసిన వారియందు క్రమ ప్రవర్తనము, శత్రువుల యందుపరాక్రమమును, పెద్దలయందు ఓర్పను, స్త్రీల యందు దిట్ట తన ము ఏ పురుషులు కనబరుతురో అట్టివారలే లోక స్థితికి కారణభూతులు.





19. సత్య సూక్తి ఘటించుధీజడి మ. మాన్ చు/
గౌరవ మొసంగు జనులకు గలు షమడచు /
గీర్తి బ్రకటించు చిత్తవిస్పూర్తి జేయు /
సాధుసంగంబు సకలార్థసాధనంబు .


తా - సత్సహవాసము బుద్ధిమాంద్యమును పోగొట్టును. సత్యవాక్యములనే పలుక జేయును. మంచి గౌరవమును ఇచ్చును. పాపములను పోగొట్టును. మనసును బాగుచేయును. నలుదిశల గీర్తిని వ్యాపింప జేయును. వేయేల? అది చేయజాలని మంచి ఏ లోకము నను లేదు.




20. సుకుృతాత్ములు రససిద్దులు /
సుకవీంద్రులు విజయ.నధులుసుమ్ము తదీయా /
ధిక కీర్తిశరీరంబులు /
ప్రకటజరామరణ జన్మ భయ రహితంబుల్.


తత్తద్ర సానుగుణముగ వర్ణం చునైపుణ్యము ఉండటచేత ధన్యాత్మల గుక వీశ్వరులు.జరామరణములు లేని తమ కీర్తి శరీరములచే .సిద్ధి ఔషధ సేవ చేజరామరణము లను అతిక్రమించి యోగుల వలె సర్వదా ప్రకాశించుచుందురు.
ఇది నీతిశతకము నందు విద్వత్పద్దతివర్ణన సమాప్త o

05 June 2017

మూర్ఖుల ప్రవర్తన

జలముల నగ్ ని ఛత్రమున జండ మయూఖుని దండతాడనం /
బులవృషగర్ దభములను బొలుపగుమ్మత్తకరీం ద్రమున్ సృణిం/
జెలగెడు రోగ మౌషధము చే విష ముందుగమంత్ర యుక్తిని /
మ్మల దగు జక్క జేయన గుమూర్ఖని మూర్ఖతమాన పవచ్చనే.


తా - నిప్పుకి జలము, ఎండకు గొడుగు, మదగజమునకు అంకుశము . ఎద్దుగాడిద మొ.. ల గు జంతువులకు కర్ర. రోగమునకు వివిధ మైన మందులు. సర్వ విషమునకు పలు విధముల గు మంత్ర ములను శాస్త్ర.ము లందుని వారు కములని చెప్పబడెను. కాని మూర్ఖత్వమును పోగొట్టు ఔషధము ఏ శాస్త్రము నందు చెప్పబడలేదు.

Blogging Courtesy, my mother Mrs. N .V. Lakshmi

మూర్ఖుల ప్రవర్తన

ఆ కాశంబున నుండి శంభుని శిరంబిందుండి శీతాద్రి సు /
శ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకంబునం దుండియ /
స్తో కాంబోధి బయోధి నుండి పవనాంధోలోక ముంజేరె గం/
గా కూలంకుష పెక్కు భంగులు వివేక బ్రష్ట సంపాత ముల్.


తా-గంగా నది మొదట ఆకాశమునుండి ఈశ్వరుని తల మీద ను అచ్చటనుండి హిమవత్పర్వతముమీదకు అచ్చటనుండి భూమి మీదకు భూమి నుండి సముద్రమునకు.. అచ్చటనుండి పాతాళమునకు వచ్చేను.గొప్ప స్థితి నుండి తొలగిన వారికి ఇదే విధముగ అనేక పాట్లు సంభవించును వివేకము నశించి న వారు ఈ విధంగా పతనం చెందుతారని కవి భావన

Blogging Courtesy, my mother Mrs. N .V. Lakshmi

మూర్ఖుల ప్రవర్తన

క్రిమి సముదాయం సంకులము గే వల నింద్యము పూతి గంధ హే /
యమును నిరాని షంబు ముఖరాంగభవం బగు నెమ్ము గుక్క దా/
నములు చు జెంతనున్న సురనాధుని గనుకొని సిగ్గు జెందద /
ల ఎమని నిజ స్వభావము దలం పదు.నీ చపు ప్రాణి యెయ్యడన్.


తా. - కుక్క పురుగులు కలసిన దియు, చొల్ల చేత తడిసినదియు, కంపు కొట్టట చేరోత పుట్టించునదియు.మాంసము లేనిది అగుగాడిద ఎముకను అతి ప్రతి తో కొరుకుచు తన సమీపమునకు.దేవేంద్రుడు వచ్చి నిలచినను చూసి సిగ్గుపడదు.నీ చప్రాణి గ్రహించిన వస్తువుతుచ్చ. మా కాదా అను విషయమును లెక్కచేయదు కదా!


Blogging Courtesy, my mother Mrs. N .V. Lakshmi

మూర్ఖుల ప్రవర్తన



తెలివి యొకింత లేని యెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్ /
దెలిసి తినంచు గర్వితము తిన్ విహరించి తి దొల్లి యిపుడు /
ఉజ్య ర మ తులైన పండితుల సన్నధి.నించుకబోధ శాలినై /
తెలియని వాడనై మెలగిలి తిం.గతమ యే నితాంత గర్వమున్.


తా - నేను కొంచెముగ తెలిసికొని యుండు కాలమున మదగజము వలె మదించి నేనే సర్వ జ్ఞాన ,వంతుడునని తలచితిని. పిదప పెద్దల వలన కొద్ది కొద్దిగ ఎపుడు తెలిసికొంటినో అపుడు నేను మూర్ఖడననియు.నాకేమీ తెలియదని తలచి జ్వరమును వదిలి సుఖపడినట్లు గర్వమును విడిచి సుఖపడితిని.



Blogging Courtesy, my mother Mrs. N .V. Lakshmi

మూర్ఖుల ప్రవర్తన

స్వవశముహితంబు మూఢతా చ్చా.దనంబు
గా గనీ గతి నిర్మిoచెగమలభవుడు
సర్వ విదుల గుసు జనులు సభలో న
మౌనమెవిభూషణము మూఢ మానవులకు.


తా -బ్రహ్మ మూఢులు తమ మూఢత్వము దాచుకొనుటకు తమకు స్వాధీనమై యుండునట్లు మౌనమును సృజించెను. పండితుల యొదుట మౌనముగా నుండుటయే మూఢులకలంకారము.


Blogging Courtesy, my mother Mrs. N .V. Lakshmi

Poem

కరి రాజున్ బిస తంతు సంతతుల చే (గట్టన్ విజృంభించువా
డు రువ వజ్ర oబు శిరీషపు షఎములచే నూహించు భేదింప (దీ/
పురచింపన్ల వణాబ్దికిన్ మధుకణంబు o జిందు యత్నంచు ని/
ద్ధరణిన్ మూరుఖల దెలు ఎనెవ్వడు సుధాదీరా ను కారోక్తులన్

తాత్పర్యము - మదపుటేనుగును తామర తూటి దారముతో బంధింప జూచువాడును, దిరిసెన పువ్వ.కొన చేత వజ్రమునుగో య చూచువాడును, లవణ సముద్రము నందలి నీరును తీయగా జేయుటకు నందొక తేనె బొట్టును విడుచువాడును, మంచి మాటలతో మూర్ఖులను సమాధానపెట్టదలచువాడును సమానులు.

Blogging Courtesy, my mother Mrs. N .V. Lakshmi

మూర్ఖుల ప్రవర్తన

తివిరి యిసుమున దైలంబు తీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు
దిరిగి కుందేటి కొమ్ముసాధింపవచ్చు
జేరి మూర్ఖనిమనసు రంజింప రాదు.

ప్రయత్నము తో ఇసుకనుండి చమురు తీయవచ్చు. ఎండమావుల యందు సైతము నీరు సంపాదించి త్రాగవచ్చును తిరిగి తిరిగి కుందేటి కొమ్ము సైతము సాధింపవచ్చును కాని దురాగ్ర హము గల మూడు .ని మనసుని మాత్రము సమాధాన పరచుట సాధ్యము కాదు.

Blogging Courtesy, my mother Mrs. N .V. Lakshmi

దుర్జన పద్ధతి

ఏనుగు లక్షమణ కవి వలె ఎలకూ చి బాలసరస్వతి కూడ భర్తృహరి నీతి పద్యములను తెనిగించెనుతిరులో ఒకటి. వసుధం గుందేటి కొమ్ము తెచ్చుకొనగా వచ్చం బ్రయత్...