24 May 2017

Poem

మకరముఖాంతర స్థమగు మా నికమాన్ బెకిలింపవచ్చు బా /
యక చల దూ ర్మ కాని కరమైన మహోదధిదాటవచ్చు మ/
స్తకమున బూవు దండ వలె సర్పము నైన భరింపవచ్చు మ/
చ్చి గటి యించి మూర్ఖ. జనచిత్తము దెలపనసాధ్వమేరికిన్.



మొసలి నోటిలోని కోరల నడుమ నుండు రత్నమును ప్రయత్న . ముతో బయటికి తీయవచ్చును. పెద్ద అలలు గల సముద్రమునైన దాటవచ్చును. కోపముతో బుసకొట్టు పామునెైనను పూల దండ వలె శిరమును ధరింపవచ్చు. కాని దురాగ్రహముతో మూడుడైన వాని మనసును సమాధాన పరచుట సాధ్యము కాదు


Blogging Courtesy, my mother Mrs. N .V. Lakshmi

భర్తృహరి సుభాషితం - 1

బోద్దు. లగువారు మత్సరపూర్ణమతులు /
ప్రబల గర్వ విదూషితుల్ ప్రభువు లెన్న /
ని తరమనుజుల బోధో పహరులు గాన /
భావమున జీర్ణమయెసు భాషితంబు


తెలిసిన వారు అసూయతోనున్నరు ప్రభువులు గర్వా Oధులు సామాన్య మానవులకు విను నంతటితెలివి తిలేదు కావున నేను చెప్పదలచిన తి సుభాషితం నా యందే అణిగిపోయింది.
గ్రంధకర్త నీతిశతకమున మూర్ఖ పద్ద తినారంభించుతూ ముందు "మంచి మాట చెప్పిన వినువారు అరుదు" అనుచునా

ఇది భర్తృహరి సుభాషితానికి ఏనుగు లక్షమణ కవి తెనిగింపు ఇది మొదటి పద్యం



Blogging Courtesy, my mother Mrs. N .V. Lakshmi

గువ్వల చెన్న శతకం - 1

గుడి కూలును నుయి పూడు ను
వడి నీళ్ళం జెరువు తెగును వనమును ఖలమౌ
చెడనిది పద్యము సుమ్మి
కుడి యొడ మల కీర్తి గన్న గువ్వల చెన్నా


-- గువ్వల చెన్న శతకం


పద్య గొప్పతనాన్ని వర్ణన చేస్తూ కవి గుడి, నుయి., చెరువు.వనము అనే దృష్ట్రా.0తాలు చెప్పాడు. ప్రాచీనులు మానవ ప్రయత్నంతో ప్రతిష్టంచే విపుణ యదాయకాలైన వి7 రకాల సంతానాలను చెప్పారు అవి (1) తటాకము (2) నిధి C 3) అగ్రహారము (4) దేవాలయము.(5) వనము (6) ప్రబంధము. (7) పుత్రుడు - వీటి లో పేరెన్నకగన్నది కావ్య రచనే. పద్యము యొక్క గొప్పతనాన్నీ కీర్తించటమే కవి హృదయం.ఉత్తమ కావ్యనికి జరామరణాలు ఉండవు. కనుకనే భర్తు హరి "సుకవితాయ ద్యస్త్రి రాజ్య ఏన కిమ్" అని పలికాడు. కవితా సామ్రాజ్యమే ఉంటే రాజ్యంతో పనేంటి?


Blogging Courtesy, my mother Mrs. N .V. Lakshmi

మనుచరిత్ర

అట జనికాంచె భూమిసురుడంబర చుంబి శిరస్సరత్ జరీ /
ప ట ల ముహు: ముహ: లు ఠ ద భంగ తరంగ మృదంగ నిస్వన /
సుఎటనటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జూలమున్ /
గటక చరత్ కరేణుక రకంపిత సాలము శీత శైలమున్
 --- అల్లసాని పెద్దన, మనుచరిత్ర


ప్రవరుడు కాళ్ళకి లేపనం రాసుకుని హిమాలయ పర్వతాల దగ్గరకు వెళ్ళాడు అక్కడ మంచుకొండ కొమ్మలు నింగిని తాకుతున్నాయి వాటి నుండి సెలయేళ్ళుజూరుతున్నయి వాటిలో లేచి పడే అలల సవ్వడిమద్దిలా మోతల్లా ఉన్నాయి.వాటికి  పరవశించిన నెమళ్ళు పురివిపిఎఆడుతున్నాయి. ఏనుగులు తొండాలతో అక్కడి మద్ది చెట్లను పెకిలిస్తున్నాయి.అటువంటి మంచుకొండను చూసాడు ప్రవరుడు అసామాన్యమైన హిమాలయాలను వర్ణన చేయడానికి ఈ సంస్కృత పదజాలం అవసరమైనది


భూమిసురుడు = ప్రవరుడు
అటన్ + చని = అక్కడకు వెళ్ళి
అంబర చుంబి = ఆకాశానితాకు చున్న
శిరస్ = శిఖరాల నుండి
సరత్ - -జారుతున్న
రుు. రీ పటల = నెమళ్ళ సమూహంలో
ముహు : ముహు : = మాటిమాటికి
లు ఠ త్ - - దొర్లుతున్న
అభంగ= ఎడతెగని
తరంగ = అలలు అనే
మృదంగ = మద్ధి లల యొక్క
నిస్వన = ధ్వనుల చేత
స్వుట = స్పష్టమైన
నటన + అనుకూల = నాట్యమునకు తగినట్లుగా
పరిపుల్ల = మిక్కి లి విప్పారిన
కలాప = పురులు గల
కలాపి జాలమున్ = నెమళ్ళు గల దానిని
కటక చ రత్ = పర్వత మద్య ప్రదేశాలలో తిరిగే
కరేణుక ర = ఆడ ఏనుగుల తొండా ల చేత
కంపిత = కదలించబడిన
సాలమున్ = మద్ది చెట్లు గల దానిని
నీత శైలమున్ = మంచుకొండను
కాంచెన్ = చూసెను.

కేవలం శబ్దoతో అర్థ స్ప్రరణ కలిగించడం ఈ పద్యంలో కవి సాధించిన విశేషం.ఇందులో అట, చని, కాంచె అను 3 మాటలు తప్ప మిగిలినవి సం స్బ్రతం నుండి వచ్చిన తత్సమ పదాలే







Blogging Courtesy, my mother Mrs. N .V. Lakshmi

రామలింగేశ శతకము - 1

జనులు నిందించిన సామ్రాజ్యమేటికి నక్కరకొదవ నియర్థమే ల
జయము సిద్ధిం పని సాహసం బేటికి/
సిరి లభింపని రాజసేవయేల/
అక్షరం బెరుగని యధికారమేటికి /
గోరిక దీరని సతి కూటమే ల/
వినయంబు గల గని వితరణం బేటికి/
క్షమదొలంగిన తపశ్చర్య యేల/
కాంత మందిరమున లేని కలిమియేల /
పరుల నొప్పింప నాశ్రితోద్దరణ యేల/
కవులకీయ నిదాతృత్వ గరిమ యేల/
రామలింగేశ!రామచంద్రపురవాస!


 అడిదము సూరకవి, రామలింగేశ శతకము


ప్రజలు నిందించే రాజ్యం ఎందుకు?
అవసరానికి పనికిరాని ధనమెందుకు?
విజయం దక్కని సాహసం ఎందుకు?
ధన ప్రాప్తి లేనప్పడు రాజసేవ ఎందుకు?
అక్షరజా ఞ నం లేని అధికారం ఎందుకు?
తృప్తి లేని కలయిక ఎందుకు?
వినయం లేని దాతృత్వం ఎందుకు?
ఓరుపు లేని తపసు ఎందుకు?
ఇంట్లో ఇల్లాలు లేని సంపద ఎందుకు?
ఇతరులను ఒప్పంచలేని చో ఆశ్రితులను ఉద్దరించడం ఎందుకు?
కవులకు దానం చేయ్యనిదాతృత్వ వైభవం ఎందుకు?



ఒకే ఒక్కసీ సపద్యంలో ఇన్నీ నీతులు చెపిఎనవాడు అడిదము సూరకవి. ఇతడు 1770 ప్రాంతంలో విజయనగరం భూపాలరాజు రేగ లో జన్మము చెందాడు. కవిజనరంజనము, కవి సంశయవిచ్చే దము (చందో వ్యాకరణ గ్రంధము) చంద్రా లోకము  (అలంకార శాస్త్రము) ఆంధ్రనామ శేషము (నిఘంటువు) శ్రీరామదండకము , రామలింగేశ శతకము మొదలగు రచనలు చేసాడు..' గడియకు నూరు పద్యములు గంట ము లేకవ చింతున నిచెప్పుకున్న . కవి ఇది ప్రధానంగా అధిక్షేప శతకం



Blogging Courtesy, my mother Mrs. N .V. Lakshmi


నరసింహ శతకము - 1

తల్లిగర్భమునుండి ధనము తేడెవ్యడు
వెళ్ళిపోయొడు నాడు వెంటరాదు
లాక్షాధికారైన లవణమన్న మెకాని
మెరుగుబంగారం బు మింగబోడు
విత్త మార్జన చేసి విర్రవీగు టెకాని
కూడబెట్టిన సోమ్మ కుడువబోడు
పొందుగా మరుగైన భూమి లోపలబెట్టి
దానధర్మము లేక దాచి దాచి
తుదకు దొంగల కిత్తురో దొరల కవు నో
తేనె జుం టీగలియ్య వా తెరువరులకు
భూషణవికాస! శ్రీధర్మపురనివాసl
దుష్టసంహార! నరసింహ1. దురితదూర!



కవి శేషప్ప, నరసింహ శతకము.
ధర్మపురిలో వెలసిన ఓ నరసింహస్వామి ! అలంకార వైభవంగల వాడా!దుర్మార్గులను సంహరించే వాడా! పుణ్య స్వరూపుడా! పుట్టిన పిల్లవాడెవ్య డూ తల్లిపేగుతో తప్ప డబ్బ మూట తో ఈ నేల మీద పడటం లేదు లక్షలు సంపాదించినా ఉప్పుతో కూడిన

అన్నం తప్ప బంగారం బువ్య కావటం లేదు. ధనం సంపాదించి గర్వంచడమే తప్ప గడించిన సోమ్మను భుజించడం.లేదు. దానధర్మాలు చేయకపిసినారితనంతో భూమిలో పాతిన సోమ్ము దొంగల పాలవుతుంది.లేదా రాజుల పాలవుతుంది. తేనెటీగలు

తేనెను సేకరించి దాచిపెట్టి కడకు ఏ దారిన పోయే దానయ్యకు ఇవ్వటం లేదా?



Blogging Courtesy, my mother Mrs. N .V. Lakshmi

వడ్లగింజల కథ

తణుకు అనే ఊరిలో శంకరప్ప అనే అబాయి ఉండేవాడు అతను చదరంగ ప్రవీణుడు.ఒకసారి తన ఆర్థిక సమస్యల నుండి గట్టు ఎక్కడానికి పిఠాపురం రాజ గారి దగ్గరకు వచ్చాడు. కాని దివాన్ గారి వలన అతనికి రాజు దర్శనం కలగలేదు.అప్పడు ఆ

వూరిలో ఉన్న పేదరాశి పెద్దమ్మ సలహాతో అక్కడ ఉన్న చదరంగప్రవీణులను ఓడించాడు. దానితో రాజుగారు శంకరప్పను పిలిచి చదరంగప్రవీణుడైన రాజు ఆట ఆడాడు. దానిలో రాజు ఓ రిపోగా ఏం కావాలి అని అడగాడు. శంకరప్ప చదరంగంలో 64

గళ్ళు ఉంటాయి కదా ఒక్కక్క గడికి రేట్టింపు చప్పన వడ్లగింజలు ఇపి్పంచమన్నడు వివరంగా తెలుసుకున్న రాజు గుడ్లు తే సాడు ఎందుకంటే ఈ లెక్క పావులూరి మల్లన తెలుగించిన సారసంగ్రహ గణితమ్ అనే పుస్తకంలో ఉంది

మొదలొకటి నిలిపి దానం
గది యగదు దిదాక రెట్టి గా గూడిన చో
విదితమగు బలుకు మా కుం
జ దరంగపు టింట్లకైన సంకలిత మొగిన్
దీనికి సమాధానం కూడ పద్యంలోనే ఇచ్చాడు
శరశశి హటక చంద్ర శరసాయ కరందువియన్నగా గిని భూ
ధర గగనాబ్ది వేదగిరి తర్ కపయోనిధి పదమ జాస్య కుం
జ ర తుహినా oశు సంఖ్యకు నిజం బగు తచ్చ తురంగ గేహ వి
స్తర మగు రెట్టి రెట్టిక గుసంకలితం బుజగత్ప్రసిద్ధి.గన్
భారతీయ పద్ధతిలో ఒక్కో అంకెకు ఒక సంకేతం ఉంటుంది
శరము, సాయుకకు = బాణం మన్మధుడి బాణాల 5
శశి, చంద్రుడు' తుహినా oశువు = చంద్రుడు ఆకాశంలో చందమామ ఒక్కడే
కాబట్టి 1 అంకె
షట్కము-- ఆరు . తర్కశాస్త్రములు 6
రంధ్రము = నవరంధ్రాలు దీనికి 9 అంకె వేయాలి
వియత్తు, గ గ నము = ఆకాశము అంటే శూన్యం దీనికి Oవేయాలి
నగము. భూ ధరము గిరి = పర్వతం కుల పర్వతాలు 7 దీనికి 7 అంకెవేయూలి
అబ్ది ,పయోనిధి = సముద్రం మహాసముద్రాలు 4 అని చెబుతారు గనక 4
వేదాలు 4 కనుక 4 అంకె
పదమ జ + అస్యములు = బ్రహ్మ ముఖాలు 4
కుంజరము = ఏనుగు ఎనిమిది దిక్కుల భూభారాన్నీ మోసే వి -అష్ట దిగ్గజాలు 8
పద్యంలోని మాటలను బట్టి ఈ అంకెలను మన లెక్కల పద్ధతిని బట్టి మనకనుండి వేసుకొని రావాలి అలా వేసుకొని వస్తే వచ్చే సంఖ్య
18446744 o73709551615
అంటే లక్షల కోట్ల కోట్ల గింజల పైమాటే తరువాత రాజుగారు శO కరప్పని ఘనంగా సంతోషపెట్టారు. ఇది మహా రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రీ గారి 'వడ్లగింజల కథ


Blogging Courtesy, my mother Mrs. N .V. Lakshmi

కృష్ణదేవరాయుల కీర్తి

నరసింహ కృష్ణరాయని
కరమరు దగు కీర్తి యొపెఎకరి బిత్ గిరి బిత్
కరికరి బిత్ గిరి గిరి బిత్
కరి బిత్ గిలి బిత్తు రంగ కమనీయంబై .


నరసింహ = నరసింహరాయలకు మారుడైన
కృష్ణరాయల : కృష్ణదేవరాయుల
కరము: చేయిమిక్కలి అరుదగు =ఆశ్చర్యకరమైన
కీర్తి = కీర్తి
కరి+ బిత్ = గజాసురుని చంపిన శివుని వె
గిరి + బిత్ +కరి = పర్వతాలను బే.దించిన ఇంద్రుని యొక్క ఏనుగు వె
కరి+ బిత్ + గిరి = ఈశ్వరుని కైలాసము వలె
గిరి బిత్ = ఇంద్రుడు వలె
కరిబి త్ గిరి బిత్ - - ఈశ్వరుడు ఇంద్రుల
తురంగ = వాహనాలైన నంది అశ్వముల వె
కమనీయంబై = మనోహరమై ఒపెఎన్‌= - ప్రకాశించెను. అంటె అంత ఏక ళo కం లేకుండా రాయల కీర్తి ప్రకాశిస్తుందని భావము

Blogging Courtesy, my mother Mrs. N .V. Lakshmi

మాటకుమాట పద్యనికి పద్యం

ఇవి చాటుపద్యం వీటిని దీపాలపిచ్చయ్యశాస్త్రి గారు వెలికి తీసారు - మాటకుమాట పద్యనికి పద్యం
పర్వత శ్రేష్ట పుత్రిక పతి విరోధి
యన్నపెండ్ల ము అత్తను గన్న తల్లి
పేర్మ మీరిన ముద్దుల పెద్ద బిడ్డ
సున్నమించుక తేగ దే సందరాంగి

ఒక సరసుడు సరసురాలింటి వెళ్ళిన సందర్భంలో ఆమె అతనికి ఆకులు వక్కలు ఇచ్చింది మరయాదాపూర్వకంగా .అప్పడు ఆ సరసుడు సున్నం తెమ్మం అడిగాడు ఇందులో ఆయన పాo డిత్యంతో బాటు చులకన కూడ ఉoది ఎలాగంటే
పర్వతుడు అంటే హిమవంతుడు అతని పుత్రిక పార్వతి - ఆమె పతి శివుడు - శివ విరోధిమన్మధుడు - అతని అన్న బ్రహ్మ - అతని భార్య సరస్వతి - ఆమె అత్త లక్ష్మీ - ఆమె తల్లి సముద్రం దాని పెద్ద బిడ్డ జేష్ట్రాదేవి ఆమెను దరిద్ర దేవత అంటారు.

ఇంతకీ ఈ పద్య సారాంశముజేసిపెద్దమ్మ సున్నం తీసుకురా అని


ఆయన సరసం లో విరసాన్నీ గ్రహించి ఆ ము ఇలా జవాబు చెప్పం ది
శతపత్రంబుల మిత్రుని
సుతు జంపినవాని బావసును నిమా మన్
సతతము దాల్చెడు నాతని
సుతు వాహన వైరి వైరి సున్నం బిదిగో
అంటి ఆమె ఆయన కన్నా రెండు ఆకులు ఎక్కు వచదివింది
శతపత్రం అంటి పద్మ o-పద్మ బాంధవుడు సూర్య డు - అతని సుతుడు కర్ణుడు, అతనిని చంపినవాడు అర్జనుడు - అతని బావ కృష్ణ డు - అతని కొడుకు మన్మధుడు - అతని మామచంద్రుడు - అతనిని తలపై ధరించేవాడు శివుడు, శివుని కొడుకు

వినాయకుడు -అతని వాహనం ఎ లుక - దీని వైరి పిల్లి దీని వైరి కుక్క. సారాంశము ఏమిటంటే ఓరి కుక్క. సున్నం ఇదిగో అని.


Blogging Courtesy, my mother Mrs. N .V. Lakshmi

ఆవకాయ

మామిళ్ళ ముక్క పై మమకారమంజల్లి
అం దింపగా జిహ్వ ఆవకాయ
ఎండ కాలమునందు ఎండిపోయిన గుండె
కభినందము తెలుపనావకాయ
కూర లే లేని చోకోమలి వేయుచో.
అనురాగ ముం జూపు నావకాయ​​
చీకు చున్నను గాని పీకు చున్నను గాని
ఆనందమేయిచ్చునావకాయ
ఆంధ్రలకు ఎ న్నీ కల గుర్తు ఆవకాయ
అతివనడుమైన జాడీ యే ఆవకాయ
ఆంధ్రమాత సిందూరమ్ము ఆవకాయ గారు
ఆంధ్ర దేశమ్ముతానొక్క ఆవకాయ


గరికపాటి గారి శతావధాన కార్యక్రమంలో బి.వి.రామసుబ్బమ్మగారు ఆవకాయ అంశము పై ఆశువుగా చెప్పిన పద్యము

Blogging Courtesy, my mother Mrs. N .V. Lakshmi

దుర్జన పద్ధతి

ఏనుగు లక్షమణ కవి వలె ఎలకూ చి బాలసరస్వతి కూడ భర్తృహరి నీతి పద్యములను తెనిగించెనుతిరులో ఒకటి. వసుధం గుందేటి కొమ్ము తెచ్చుకొనగా వచ్చం బ్రయత్...