12 December 2016

Censor

I wrote this a long time back during the days of Censor's over enthusiasm and some absurd rules from them. (I think circa 2008). I lost this and recently found it again. Posting here.
==================================================================

డైరెచ్టరు, రచయిత కలసి తీవ్రంగా ఆలోచిస్తున్నారు. కొత్త సెన్సారు నిబంధనలను అనుసరిస్తూ ఒక మంచి స్క్రిప్టు తయారుచేసుకోవాలన్నది వాళ్ళ ప్రయత్నం.

ర: సార్ కులం పేరు సూచిస్తూ పేర్లుండకూడదన్నారు కదా ఎలాగ సార్
డై: దాందేముందయ్యా అది చాలా సులువు. ప్రేమ కధ తీదాం. కులాంతర వివాహం కూడా అవుతుంది. ఇంకా క్రేజ్ వస్తుంది. ప్రేమ కధకు కులంతో పనేముంది?
ర: అలాంటి ప్రేమకదలు చాలా వచ్చాయి కద సార్
డై: మరోటి తీద్దామయ్యా
ర: అలాగే సారి. సో మనది ప్రేమ కధ. అద్భుతమైన కధ ఉంది నా దగ్గర. అబ్బాయిది విశాఖపట్టణం. అమ్మయిది హైదరాబాదు. అబ్బాయి పేరు కృష్ణ. అమ్మాయి పేరు రాధ.
డాఇ: ఆగవోయ్. అవి హిందువుల పేర్లు కాదూ? మరి సెన్సారుతో ఇబ్బంది అవుతుందే. 
ర: మరి లైలా బాషా అందామా సార్?
డై: అవి కూడా కుదరదయ్యా. ఇస్లాం పేరు వస్తుంది కదా
ర: మరి దేవకుమార్, మరియ అని పెడదాము సార్
డై: ఒకసారి చెబితే అర్ధం కాదేమయ్యా. కులం మతం ప్రస్తావనకు రాకూడదయ్యా 
ర: ఏ కులం మతం రాకుండా పేర్లు ఎలా పెడతాము సార్?
డై: ఆలోచిద్దామయ్యా, ప్రస్తుతానికి హేరో హీరోయిన్ అందాము. కధ చెప్పు.
ర: అలాగే సార్. హీరో హీరోయిన్ ఇద్దరూ ఒకటే కాలేజీలో చదువుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరికీ హీరోయిన్ కుక్కపిల్ల విషయంలో గొడవ వస్తుంది.
డై: ఏమయ్యోయ్ కొంప ముంచేట్టు ఉన్నావు. సేన్లోకి జంతువులు రాకూడదయ్యా
ర: సరే సార్. పోనీ హీరో హీరోయిన్ ఇద్దరూ ఎదురెదురు ఇళ్ళలో ఉంటారు. హీరోయిన్ తలదువ్వుకుంటూ ఉంటే చూసిన హీరో మనసుపడతాడు.
డై: బాగుందయ్యా, కానీ తలదువ్వుకుంటూ పేలు తీసుకోవడం జంతుహింస అని గొడవ వస్తుందేమో హీరోయిన్ మొహం కడుక్కుంటున్నప్పుడు అని రాయి.
ర: హీరోయిన్ స్నానం చేస్తున్నప్పుడు అని రాస్తే బాగుంటుందేమో సార్. పనిలో పని హీరోయిన్ ని పైనా కిందా ఎగాదిగా చూపించేయొచ్చు.
డై: నువ్వు నాకు నచ్చావయ్యా రైటరూ. అలాగే రాద్దాం. హీరోయిన్ బట్టల విశయంలో పెద్ద ఖర్చు ఉండదు. సెన్సారు కూడా ఇబ్బంది పెట్టదు. ప్రోసీడ్
ర: సార్... తరువాత హీరో ఇలాగ తొంగి చూడడం చూసిన హీరోయిన్ అన్నయ్య హేరోతో గొడవ పడతాడు. 
డై: బాగుందయ్యోయ్. పనిలో పని హీరో హీరోయిన ఆన్నయ్య గాంగు మొత్తాన్ని చితగ్గోట్టినట్టు చూపిద్ద్దాం. వయొలెన్సు పరవాలేదు. ఒక నలుగు రక్తం కక్కుకు చచ్చినట్టు, ఇద్దరికి కాళ్ళూ చేతులూ తెగినట్టు, ఒకడిక్ అవయవాలు అన్నీ నేల మీదకు 
   ఊడిపడినట్టు చూపిద్దాం. పరవాలేదు.
ర: అలాగైతే మరీ అతి అవుతుందేమో సార్. 
డై: మరి సినిమా అన్నాక ఏదో ఒకటి చూపించాలి కదయ్యా. అన్నిటి కన్నా సులభమైనవి శృంగారం, భీబత్సం. కానీ.
ర: అలాగే సార్. ఇహను పొతే, ఇంత గొడవ తరువాత హీరోయిన్ తండ్రి, హీరో మీద కేసు పెడతాడు. అయితే అక్కడ పోలీసు ఇన్స్పెక్టరు కేసు నమోదు చేసుకోడు.
డై: అదేమిటి? పోలీసు ట్విస్ట్ ఆ?
ర: అదే సార్ ట్విస్టు. ఇన్స్పెక్టరు  అలా ఎందుకు చేసాడో ఫ్లాష్ బాక్ లో చెప్తాం.
డై: కుదరదయ్యా. ఫ్లాష్ బాక్ ఏదైనా సరే, పోలీసులు ఎప్పుడూ మంచివాళ్ళే ఉండాలి. అది సెన్సార్ రూలు. దానిని మార్చడానిక్ వీలులేదు.
ర: అదేమిటి సార్. ఫ్లాష్ బాక్ లో పోలీస్ అలా ఎందుకు చేసాడు అనడానికి కారణం ఉంది.
డై: ఏ కారణం ఉన్ననయ్యా. పోలీసులను చెడ్డవాళ్ళుగా చూపించడానికి వీలులేదు. అది డబ్బులు తీసుకుని మనుషుల్ని చంపేసిన దయాశంకర్ గురిచి అయినా సరే. పోలీసులు ఎప్పుడూ మంచివాళ్ళగానే చూపించాలి.
ర: సరే సార్. అయితే హీరోను బెయిలుమీద వదిలేసినట్టు చూపిద్దాం.
డై: సరే. బానే ఉంది. తరువాత?
ర: ఆ తరువాత హీరోయిన్ అన్నయ్య హత్య జరుగుతుంది సార్.
డై: అబ్బో మర్డర్ మిస్టరీ ఆ? 
ర: అవును సార్. ఆ హత్యకేసు విచారించిడానికి పోలీసులు తెచ్చిన కుక్క హీరో గుమ్మం దగ్గర ఆగుతుంది సార్.
డై: ఏమయ్యోయ్ నీకు ఎన్నిసార్లు చెప్పాలేమిటి? జంతువులు వద్దు అన్నానా?
ర: మరి ఎలాగ సార్? ఇక్కడ హీరోయిన్ కి హీరో మీద అనుమానం రావాలి. 
డై: అనుమానం ఇంకో రకంగా తెప్పించు. కుక్కలూ, పిల్లులూ వద్దు.
ర: పోనీ, హీరో కాల్చే సిగరెట్టు తాలూకు ఎంగిలి పీక హీరోయిన్ అన్నయ గదిలో దొరికినట్టు చూపిద్దామా సార్
డై: అది అంతకన్నా వద్దు. ధూమపానం నిషేధం.
ర: రోజూ అందరూ కాలుస్తూనే ఉంటారు కద సార్.
డై: కావచ్చు గాక. సిగరెట్లు, బీడీలమీద గవర్నమెంటు పుర్రె గుర్తు వద్దంటే తప్పు లేదు కానీ, సిగరెట్టు కాల్చినట్టు మనం చూపిస్తే తప్పు. కాబట్టి హీరో సిగరెట్టు కాల్చడం మనం చూపించకూడదు.
ర: మరేం చెయ్యమంటారు సార్?
డై: ఇదుగో ఈ మర్డర్ మిష్టరీలు గట్రా వద్దు కానీ, డైరెక్టు లవ్ స్టోరీ పెట్టు.
ర: అది సులభమే సార్. హీరో "తెలుగు జాతి మనది" పాట పాడుతున్నప్పుడు హీరోయిన్ చోసి ప్రేమలో పడింది
డై: అమ్మయ్యో వద్దు. తెలుగు భాషకు ఉన్న యాసలు చూపించకూడదని సెన్సారు వారి హుకుం. 
ర: అది మనమెక్కడ చూపిస్తున్నాము సార్?
డై: ఇదుగో మరి. ఆ పాటలో "వచ్చిండన్నా, వచ్చాడన్నా" అని యాసల వర్ణన ఉంది. యాసల ప్రస్తావన కూడదయ్యా!!!
ర: అలాగైతే ఇంకేం మిగాలేదు సారు. ఇంకా మనం హీరో హీరోయిన్ల పేర్లే నిర్ణయించుకోలేదు!!!
డై: ఇక మిగిలింది ఒకటేనయ్యా!!! నువ్వు, నేను ఈ సినిమా ఫీల్డు వదిలేసి మిగిలిన ఉద్యోగాలు చూసుకుందాము. సుఖంగా ఉందాము.

దుర్జన పద్ధతి

ఏనుగు లక్షమణ కవి వలె ఎలకూ చి బాలసరస్వతి కూడ భర్తృహరి నీతి పద్యములను తెనిగించెనుతిరులో ఒకటి. వసుధం గుందేటి కొమ్ము తెచ్చుకొనగా వచ్చం బ్రయత్...