16 July 2008

ఎచటగలవో చెలీ

ప్రేయసిని కనులార వీక్షించువేళ నే అనిమిషనేత్రుడను
తన దర్శనార్ధమై వేచియుండువేళ నేనాకుంఠిత దీక్షాదక్షుడను

తన కంఠధ్వనినాలకించువేళ నే పులకితపన్నగమును
తను గాత్రము శృతి జేయునపుడు నే వర్షఋతూకాంక్ష్తుడనగు చకోరమును

తను నటమయూరియై పాదము నేలనిడునపుడు నే శశికిరణసోభితమగు కలువపూరేకును
తను అలసితయై డస్సినపుడు నే కళను గోల్పోయిన శిశిరపత్రమను

తను నా జేయి పట్టునపుడు నా చరిత్రాపర భగీరధము
తన స్వాంతన లేని బతుకు వ్యర్థము

తన కంటిపాపలో నా బింబము స్వాతిముత్యము
తనకై నా మనసు మధుపము నిండిన పుష్పము

ఎచటగలవో చెలీ, గనుమీ దీనుడిని, కటాక్షించు ఈ ప్రేమికుడిని

దుర్జన పద్ధతి

ఏనుగు లక్షమణ కవి వలె ఎలకూ చి బాలసరస్వతి కూడ భర్తృహరి నీతి పద్యములను తెనిగించెనుతిరులో ఒకటి. వసుధం గుందేటి కొమ్ము తెచ్చుకొనగా వచ్చం బ్రయత్...